Gold Rates Today: బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పట్టాయి. నిన్న భారీగా పడిపోయిన ధరలు, ఇవాళ కూడా మరింత తగ్గడం గోల్డ్ లవర్స్‌లో ఆనందాన్ని నింపింది.
ఈరోజు బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధరపై ఏకంగా రూ.1,420 తగ్గుదల నమోదైంది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,300 తగ్గడంతో రూ.1,39,100కి చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,070 తగ్గి రూ.1,13,810 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గుదల రావడంతో ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ఉంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ధరల తగ్గుదలతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారింది.
also read:10th class syllabus update | అకడమిక్ ఒత్తిడికి చెక్.. టెన్త్ క్లాస్ సిలబస్ కట్
