Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeTelanganaTelangana Rains | ఎల్‌నినో ఎఫెక్ట్‌కు చెక్.. తెలంగాణలో మళ్లీ వర్షాల జోరు!

Telangana Rains | ఎల్‌నినో ఎఫెక్ట్‌కు చెక్.. తెలంగాణలో మళ్లీ వర్షాల జోరు!

-

Chat on WhatsApp

Telangana Rains: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభిస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా మారడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, నేడు మరిన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అత్యధికంగా 77.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సంగారెడ్డిలో 71.8 మి.మీ, రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 70.8 మి.మీ, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్‌లో 61 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంస్థ వెల్లడించింది. వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp