Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeNationalTamil Nadu | బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం ఘన విజయం.. మిత్రపక్షాల పూర్తి మద్దతు

Tamil Nadu | బలపరీక్షలో విజయ్ ప్రభుత్వం ఘన విజయం.. మిత్రపక్షాల పూర్తి మద్దతు

-

Chat on WhatsApp

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీని నిరూపించుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ స్థానం మరింత బలపడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బలపరీక్ష సందర్భంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మహిళల రక్షణ, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచనల మేరకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఇక విదుతలై చిరుతైగల్ కట్చి, వామపక్ష పార్టీలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం వంటి పలు పార్టీలు కూడా విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత దూకుడుగా వ్యవహరించాలని కొన్ని మిత్రపక్షాలు సూచించాయి.

అయితే మరోవైపు అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తూ తన అసమ్మతిని వ్యక్తం చేసింది. కే. పళనిస్వామి నేతృత్వంలోని ఆ పార్టీ బలపరీక్షలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పటికీ, అధికార పక్షం తన సంఖ్యాబలాన్ని విజయవంతంగా నిరూపించుకుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp