Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeNationalAIADMK | ఏఐఏడీఎంకేకి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కరూర్ ఎమ్మెల్యే

AIADMK | ఏఐఏడీఎంకేకి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కరూర్ ఎమ్మెల్యే

-

Chat on WhatsApp

AIADMK: ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేకు తమిళనాట మరోసారి ప్రతికూల రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కరూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఆర్. విజయభాస్కర్ సోమవారం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, పార్టీతోనూ సంబంధాలు తెంచుకున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన ఆరవ ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు.

ఎం.ఆర్. విజయభాస్కర్ గతంలో దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందిన ఆయన 2021 ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి వి. సెంథిల్ బాలాజీ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2026 ఎన్నికల్లో తిరిగి కరూర్ నుంచి విజయం సాధించి అసెంబ్లీలో ప్రవేశించారు.

అయితే తాజా రాజకీయ పరిణామాలతో ఏఐఏడీఎంకేలో అసంతృప్తి పెరుగుతోందన్న చర్చ బలపడుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వేరే మార్గం ఎంచుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరినట్లు సమాచారం. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే సి. విజయభాస్కర్ కూడా త్వరలో అదే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు అంబాసముద్రం, ధారాపురం, మదురాంతకం, పెరుందురై వంటి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. వరుస రాజీనామాలతో అసెంబ్లీలో ఏఐఏడీఎంకే బలం తగ్గిపోతుండటం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిణామాలు పళనిస్వామి నాయకత్వానికి మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp