Jeevan Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. “అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని” అంటూ జీవన్ రెడ్డి తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు.
ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు.ఈ సమావేశానికి పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో ఆయన భవిష్యత్తు రాజకీయ పాత్రపై చర్చలకు దారితీశాయి. రాజకీయంగా ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.








