LIVE
Friday, November 6, 2026
LIVE
LIVE

Suriya Scene Movie | ఒకే ఏడాది మూడు బ్లాక్‌బస్టర్లు.. సూర్య మాస్ హ్యాట్రిక్!

by Bajaswamy
7 views
Suriya Scene Movie Review

Suriya Scene Movie: ఒక సినిమా హిట్ అయితేనే స్టార్ హీరోలకు పండగ చేసుకునే రోజుల్లో.. వరుసగా మూడు విజయాలు అందుకుంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు అదే జోష్‌లో ఉన్నారు. వరుస పరాజయాల తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ విజయాల బాట పట్టిన సూర్య, తాజాగా ‘సీన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘కంగువా’, ‘రెట్రో’ సినిమాలతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన సూర్యకు ఈ ఏడాది మాత్రం బాగా కలిసొచ్చింది. ఆర్.జే. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూర్య కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఆ తర్వాత టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మలయాళ బ్యూటీ మమిత బైజు కథానాయికగా నటించిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సూర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘సీన్’ సినిమాతో సూర్య తన మాస్ విశ్వరూపాన్ని చూపించారు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నవంబర్ 6న విడుదలైంది. నజ్రియా నజీమ్ కథానాయికగా నటించగా, యువ నటుడు నస్లేన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు.

క్రమశిక్షణకు దూరంగా ఉండే దూకుడు పోలీస్ అధికారి ఇంబరాజ్, గతంలో మిస్టరీగా మిగిలిపోయిన ఓ కేసును తిరిగి తెరిచి దర్యాప్తు చేయడం ఈ సినిమా ప్రధాన కథాంశం. సుశిన్ శ్యామ్ అందించిన నేపథ్య సంగీతం, వినీత్ అగస్టియన్ సినిమాటోగ్రఫీ కథలో ఉత్కంఠను మరింత పెంచాయి.సూర్య ఊరమాస్ యాక్షన్ సన్నివేశాలు, నస్లేన్ సైకో విలన్‌గా కనిపించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, సెకండాఫ్‌లో నస్లేన్ పాత్ర సూర్యకు గట్టి పోటీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘సీన్’ సినిమాలతో ఈ ఏడాది సూర్య విజయాల హ్యాట్రిక్ అందుకున్నారనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ‘సీన్’ వసూళ్లు ఏ స్థాయికి చేరతాయి? ‘జైలర్ 2’ రికార్డులను అధిగమిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More