పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(BRS MLA Malla Reddy) మరోసారి తెరదించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌ను వీడబోనని, అదే పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ కార్యకర్త తన రక్తంతో లేఖ రాయడంపై మల్లారెడ్డి స్పందించారు. ఆ లేఖ చూసిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు.
చిరునామా లేకుండా లేఖ పంపించినప్పటికీ, ఆ కార్యకర్త ఎవరో తెలుసుకుని తప్పకుండా వ్యక్తిగతంగా కలుస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తల అభిమానమే తనకు అతిపెద్ద బలం అని పేర్కొన్నారు. తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కార్యకర్తలకు సూచించిన మల్లారెడ్డి, బీఆర్ఎస్‌తో తన అనుబంధం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మార్పుపై నెలకొన్న ఊహాగానాలకు మరోసారి చెక్ పెట్టినట్లైంది.
ALSO READ: Sonam Wangchuk | నిరాహార దీక్ష విరమించిన వాంగ్చుక్.. కేంద్రం హామీ, ఇచ్చిన హామీలు ఏంటి?








