Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTNagabandham | 'నాగబంధం' ఓటీటీ ఎంట్రీ.. ఎక్కడ? ఎప్పటి నుంచి?

Nagabandham | ‘నాగబంధం’ ఓటీటీ ఎంట్రీ.. ఎక్కడ? ఎప్పటి నుంచి?

-

Chat on WhatsApp

Nagabandham: థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే మరో తెలుగు సినిమా ఓటీటీ బాట పట్టింది. ఫాంటసీ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రధాన పాత్రల్లో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్న టించగా, త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. జూలై 24 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంటి నుంచే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం లభించనుంది. పురాణాలు, సాహస యాత్ర, రహస్య నిధి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, మురళీ శర్మ, దక్ష నాగర్కర్ కీలక పాత్రలు పోషించారు.

జునైద్ కుమార్, అభే సంగీతం అందించగా, నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించారు. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణ పొందుతుందో ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nadendla Manohar addressing Janasena party leaders and workers

Nadendla Manohar | పార్టీ ఎదుగుదలే లక్ష్యం.. పదవుల కోసం తొందర వద్దన్న మంత్రి...

Janasena: పార్టీలో ఐక్యత, సమన్వయం ఎంతో అవసరమని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌(Nadendla Manohar) పేర్కొన్నారు. పొత్తులో భాగంగా రాజకీయ ప్రయాణం కొనసాగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఒకేసారి...
- Advertisement -
Chat on WhatsApp