Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeInterNationalRussia- India | ఐదోతరం యుద్ధ విమానాలపై భారత్-రష్యా భాగస్వామ్యం… పుతిన్ కీలక ప్రకటన

Russia- India | ఐదోతరం యుద్ధ విమానాలపై భారత్-రష్యా భాగస్వామ్యం… పుతిన్ కీలక ప్రకటన

-

Chat on WhatsApp

Russia- India: ఐదోతరం యుద్ధ విమానాల సమీకరణ ద్వారా వైమానిక దళాన్ని బలోపేతం చేయాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా రష్యా నుంచి కీలక ప్రతిపాదన వెలువడింది. అధునాతన స్టెల్త్ సాంకేతికత కలిగిన సుఖోయ్ SU-57 యుద్ధ విమానాలను భారత్‌తో కలిసి అభివృద్ధి చేయడంతో పాటు సంయుక్తంగా ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మీడియా సమావేశంలో మాట్లాడిన పుతిన్, ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌తో పంచుకునేందుకు కూడా తమ దేశం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాలు లేవు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వచ్చిన ఈ ఆఫర్ వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పాకిస్థాన్ చైనా తయారీ షెన్‌యాంగ్ J-35AE స్టెల్త్ ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసే అవకాశాలపై వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య రష్యా ప్రతిపాదన భారత రక్షణ వ్యూహంలో కీలక అంశంగా మారింది. భవిష్యత్ వైమానిక అవసరాల కోసం భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp