Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeTechnology Newsబడ్జెట్ ధరలో రియల్‌మీ Realme Narzo 100 Lite 5G షాక్ ఇస్తున్న స్పెసిఫికేషన్లు

బడ్జెట్ ధరలో రియల్‌మీ Realme Narzo 100 Lite 5G షాక్ ఇస్తున్న స్పెసిఫికేషన్లు

-

Chat on WhatsApp

రియల్‌మీ భారత మార్కెట్లో కొత్తగా(Realme Narzo 100 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్ 5G డివైస్ అమెజాన్ మరియు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7,000mAh భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 10 గంటల వీడియో ప్లేబ్యాక్, 70 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.13,499 నుంచి ప్రారంభమవుతుంది. 4GB + 64GB బేస్ వేరియంట్, 4GB + 128GB వేరియంట్ రూ.14,499, అలాగే 6GB + 128GB వేరియంట్ రూ.16,499 ధరకు లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

స్పెసిఫికేషన్లలో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 900 nits పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో స్మూత్ గేమింగ్ మరియు స్క్రోలింగ్ అనుభవం అందిస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

ఈ డివైస్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6GB వరకు RAM, 128GB స్టోరేజ్‌తో పాటు VC కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

కెమెరా విభాగంలో 13MP డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp