Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTPeddi | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్

Peddi | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్

-

Chat on WhatsApp

Peddi: రామ్ చరణ్ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో విజయవంతంగా కొనసాగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.366 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.

నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే 2026 సంవత్సరానికి గాను దక్షిణ భారత సినీ పరిశ్రమలో నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచినట్లు పేర్కొంది. విడుదలైన రోజు నుంచే మంచి మౌత్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, ప్రతి రోజూ స్థిరమైన వసూళ్లతో దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌కి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వీకెండ్ రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp