Puri Jagannadh: ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూరీ తల్లి కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని పూరీ కుమార్తె పవిత్ర సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన భావోద్వేగ పోస్టు పలువురిని కంటతడి పెట్టిస్తోంది.
నానమ్మ జ్ఞాపకాలతో భావోద్వేగానికి లోనైన పవిత్ర.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని చాటుతూ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇకపై నన్ను ‘చిన్నతల్లి’ అని పిలిచే స్వరం వినిపించదనే బాధను వ్యక్తం చేస్తూ, మరోసారి ఆమెను కలుసుకుని గట్టిగా హత్తుకోవాలని ఉందంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. తన నానమ్మను ఎంతగానో మిస్ అవుతున్నానని పేర్కొన్నారు. పవిత్ర పోస్ట్ చూసిన సినీ అభిమానులు, పలువురు ప్రముఖులు పూరీ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో తెరకెక్కించిన ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా పనుల్లో ఉన్న సమయంలో కుటుంబంలో జరిగిన ఈ విషాదం పూరీ అభిమానులను, సినీ వర్గాలను కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు దర్శకుడికి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ALSO READ: COVID-19 | తిరుపతిలో కరోనా కలకలం.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో అప్రమత్తమైన వైద్యశాఖ








