టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. సినిమా విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో, ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సినీ అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ కూడా ఈ ఈవెంట్‌ను ఆసక్తిగా వీక్షించారు. అయితే, ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
వేదికపై మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్, ‘‘హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కలసి ఈ వార్నర్‌ను పట్టుకొచ్చారు. క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము కొడుకు.. వీడు మామూలోడు కాదు. రేయ్ వార్నర్, నీకు ఇదే నా వార్నింగ్’’** అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు వార్నర్‌కు అంతగా అర్థం కాక నవ్వుతూ రియాక్ట్ అయినా, ఆయన అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్‌కి అసభ్యంగా మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. అయితే, రాజేంద్ర ప్రసాద్ తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేసినా, ఈ వ్యాఖ్యలు అనవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.