Railway Update: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. విజయవాడ-దువ్వాడ మార్గంలోని రాయనపాడు రైల్వే యార్డ్‌లో రీమోడలింగ్ పనులు చేపట్టడంతో, ఈ నెల 28వ తేదీ నుంచి మే 5 వరకు పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పనుల ప్రభావంతో 20 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు, 2 రైళ్లు రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు.
మార్పులు చేసిన జాబితాలో శాతవాహన ఎక్స్‌ప్రెస్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, అలాగే విజయవాడ-భద్రాచలం మెమూ, విజయవాడ-డోర్నకల్ మెమూ, విశాఖపట్నం-మహబూబ్‌నగర్, నాగావళి, నాందేడ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ వంటి రైళ్లు ఉన్నాయి.
దీంతో ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు, షెడ్యూల్‌లను పరిశీలించుకోవాలని సూచించారు.
ఇక వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. ఎస్ఎంవీటీ బెంగళూరు-సంత్రాగాచి, శాంత్రాగాచి-బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు కంటోన్మెంట్-కలబురగి, కలబురగి-బెంగళూరు కంటోన్మెంట్, ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్, బీదర్-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికులు బయలుదేరే ముందు అధికారిక రైల్వే ప్రకటనలను తప్పనిసరిగా చెక్ చేసుకోవడం మంచిదని సూచించారు.








