Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRaghavi | త్వరలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న రాఘవ లారెన్స్ కూతురు..?

Raghavi | త్వరలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న రాఘవ లారెన్స్ కూతురు..?

-

Chat on WhatsApp

Raghavi: టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో కొరియోగ్రాఫర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, తరువాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న పాత్రల్లో తన ప్రత్యేక ముద్ర వేసుకున్న రాఘవ లారెన్స్(Raghava Lawrence) ప్రస్తుతం అనేక భారీ చిత్రాల పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఆయన సమయమంతా ‘కాంచన-4’, ‘బెంజ్’, ‘కాలభైరవ’ వంటి ప్రాజెక్టులకే కేటాయిస్తున్నారు.

ఇదిలా ఉండగా, లారెన్స్ కుటుంబం నుంచి మరో కొత్త టాలెంట్ సినీ రంగంలోకి అడుగుపెట్టబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కూతురు రాఘవి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారని సమాచారం. సాధారణంగా స్టార్ కిడ్స్ హీరోలుగానో, హీరోయిన్‌లుగానో లేదా ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తుంటారు.

కానీ రాఘవి మాత్రం అందుకు భిన్నంగా దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచే సినిమా మేకింగ్, కథా రచనపై ఆసక్తి కలిగిన ఆమె, అమెరికాలో డైరెక్షన్ టెక్నాలజీపై ప్రత్యేక కోర్సు కూడా పూర్తిచేసినట్లు సమాచారం. ఇండస్ట్రీలో సాధారణంగా దర్శకులు అసిస్టెంట్‌గా ఎన్నో సంవత్సరాలు పనిచేసి అనుభవం సంపాదిస్తారు.

అయితే రాఘవి మాత్రం నేరుగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతుండటంతో ఇది పెద్ద చర్చగా మారింది. ఇది ఒక రిస్క్ అయినా, తన విజన్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన కూతురి నిర్ణయానికి రాఘవ లారెన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌ను తన సొంత బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని సమాచారం.

ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందు తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను కూడా సినీ రంగానికి పరిచయం చేసిన ఆయన, ఇప్పుడు తన కూతురిని దర్శకురాలిగా లాంచ్ చేయడం ద్వారా కుటుంబం నుంచి మరో కొత్త ప్రతిభను పరిశ్రమకు అందిస్తున్నారని భావిస్తున్నారు. రాఘవి మొదటి చిత్రం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp