Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeNationalNEET paper leak | నీట్ పేపర్ లీక్‌పై హై వోల్టేజ్ ఫైర్.. కేంద్రం ప్రకటనతో...

NEET paper leak | నీట్ పేపర్ లీక్‌పై హై వోల్టేజ్ ఫైర్.. కేంద్రం ప్రకటనతో మరింత ఉత్కంఠ

-

Chat on WhatsApp

NEET paper leak: నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్‌లో మరోసారి రాజకీయ వేడిని పెంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. అయితే చర్చను సభా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నీట్ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని రిజిజు తెలిపారు. చర్చకు సంబంధించిన సమయం, విధానం వంటి అంశాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. పార్లమెంట్‌లో నిర్మాణాత్మక చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.

మరోవైపు విపక్షాలు మాత్రం కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్‌పై వాయిదా తీర్మానం కింద చర్చ జరపాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. మూడు రోజులుగా వాయిదా తీర్మానం కోరుతున్నా అనుమతించడం లేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్‌పై చర్చ, మంత్రి రాజీనామా, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ అనే మూడు అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Chandrababu Naidu

CM Chandrababu Naidu | బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా

CM Chandrababu Naidu: కాకినాడలో సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురైన నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన బాలకృష్ణతో ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య...
- Advertisement -
Chat on WhatsApp