Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshProperty Tax | ఏపీలో పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌

Property Tax | ఏపీలో పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌

-

Chat on WhatsApp

Property Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఈ నెల 31లోపు చెల్లించే వారికి వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఇప్పటికే వడ్డీతో సహా పన్ను చెల్లించిన వారికి కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. వారు చెల్లించిన అదనపు వడ్డీ మొత్తాన్ని తదుపరి బిల్లులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఈ మేరకు జీవో నంబర్ 58ను జారీ చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలను క్లియర్ చేసుకోవాలని ప్రభుత్వం పౌరులకు సూచించింది. ఈ నిర్ణయం ద్వారా నగరాల ఆదాయం పెరగడమే కాకుండా పన్ను చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp