పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయన వివాహం నిశ్చయమైందని, త్వరలో పెళ్లి జరిగే అవకాశముందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
ఈ వార్తలకు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ మరింత బలం చేకూర్చాయి. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమవుతున్నాయంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు. అంతేకాదు, ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయిందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడని వివరించింది.
ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది చివర్లో ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.