Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeNationalCentral government | ఉల్లి రైతులకు  భారీ ఊరట.. కొనుగోలు ధర 13% పెంపు

Central government | ఉల్లి రైతులకు  భారీ ఊరట.. కొనుగోలు ధర 13% పెంపు

-

Chat on WhatsApp

Central government: ఉల్లి రైతులు దేశవ్యాప్తంగా ధరల పతనంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో ఉల్లి ధరల అస్థిరతను నియంత్రించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో బఫర్ స్టాక్ కొనుగోలు ధరను సవరించింది.

తాజా నిర్ణయం ప్రకారం ఉల్లి కనీస కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.2,125కు పెంచింది. ఇది గత ధరతో పోలిస్తే సుమారు 13 శాతం పెరుగుదలగా పేర్కొంటున్నారు. గతంలో క్వింటాల్‌కు రూ.1,875గా ఉన్న మద్దతు ధరపై అదనంగా రూ.250 పెంపు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సీజన్‌లో కేంద్రం ఉల్లి కొనుగోలు ధరను పెంచడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఉల్లి సాగు ఖర్చులు పెరగడం, మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు కొనసాగడం నేపథ్యంలో ఈ సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ చర్యలతో మధ్యవర్తుల ప్రభావం తగ్గి, రైతులకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉల్లి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana rythu bharosa funds credited to over 67 lakh farmers

Rythu Bharosa | 6 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా.. ప్రభుత్వం కీలక...

Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. వానాకాలం సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన పెట్టుబడి సాయం పంపిణీ కార్యక్రమంలో కేవలం ఐదు రోజుల్లోనే...
- Advertisement -
Chat on WhatsApp