Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTSamantha | ఫిట్‌నెస్‌ వీడియోతో ఆకట్టుకున్న సమంత.. బేబీ బంప్ వీడియో నెటింట వైరల్

Samantha | ఫిట్‌నెస్‌ వీడియోతో ఆకట్టుకున్న సమంత.. బేబీ బంప్ వీడియో నెటింట వైరల్

-

Chat on WhatsApp

Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలోని అందమైన క్షణాలను మరోసారి అభిమానులతో పంచుకుంది. జూన్ నెల తన జీవితంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని చెబుతూ, “జూన్… ఓ అందమైన ఫెయిరీ టేల్‌లా గడిచిపోయింది” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్టు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

సమంత పంచుకున్న చిత్రాల్లో ఆమె రోజువారీ జీవితంలోని ఎన్నో మధురమైన క్షణాలు కనిపించాయి. సంప్రదాయ దుస్తుల్లో తీసుకున్న ఫొటోలు, ప్రకృతి మధ్య గడిపిన సమయం, వెల్‌నెస్ ట్రిప్‌లోని విశేషాలు, తనకు ఇష్టమైన పుస్తకాలతో గడిపిన క్షణాలు, పెంపుడు శునకాలతో ఆడుకున్న సందర్భాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొన్ని చిత్రాల్లో ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించారు.

అయితే ఈ పోస్టులో అత్యంత చర్చనీయాంశంగా మారింది జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియో. బేబీ బంప్‌తో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన సమంతను చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. నటి అనన్య పాండే “సామ్” అంటూ ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తూ కామెంట్ చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల జరిగిన ‘మా ఇంటి బంగారం’ విజయోత్సవ కార్యక్రమంలో సమంత తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించింది. ప్రస్తుతం చేపట్టిన సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం ప్రసూతి విరామం తీసుకుంటానని, అనంతరం కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపింది. ఇటీవలి కాలంలో సమంత పాల్గొన్న పలు కార్యక్రమాల్లో ఆమె కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని కొత్త అధ్యాయం గురించి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp