Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTVishwambhara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విశ్వంభర’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్?

Vishwambhara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. విశ్వంభర’ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్?

-

Chat on WhatsApp

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు విడుదలపై ఊహాగానాలు వినిపించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడంతో చిత్ర బృందం అధికారిక తేదీని ప్రకటించకుండా వేచి చూసింది. ఇప్పుడు ఆ పనులు తుది దశకు చేరుకోవడంతో సినిమా విడుదలపై మరోసారి చర్చ మొదలైంది.

యువ దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేశారు. అందుకే ప్రతి ఫ్రేమ్‌ను అత్యున్నత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఎలాంటి తొందరపడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని దసరా పండుగను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ 16న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ తేదీని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే విడుదల తేదీపై స్పష్టత రానుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కెరీర్‌లోని ఫాంటసీ చిత్రాల విజయాలు, వశిష్ఠ కథన శైలి, భారీ స్థాయిలో రూపొందించిన విజువల్ ప్రపంచం ‘విశ్వంభర’పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. చాలా కాలంగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా దసరా బరిలోకి వస్తే, బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Retirement Age | ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు

Retirement Age: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే నిర్ణయాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62...
- Advertisement -
Chat on WhatsApp