Thursday, August 6, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపవన్ కళ్యాణ్ అగస్త్య మహర్షి ఆలయ దర్శనం!

పవన్ కళ్యాణ్ అగస్త్య మహర్షి ఆలయ దర్శనం!

-

Chat on WhatsApp

జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళలోని కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఆధ్యాత్మికంగా ప్రాధాన్యమైన ఈ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు ఆలయ విశేషాలు వివరిస్తూ, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.

ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ఆయనతో ఉన్నారు. ఆలయ పరిసరాల్లో పవన్ కళ్యాణ్, అకీరా సందడి చేస్తూ భక్తుల అభిమానం పొందారు. పవన్ కళ్యాణ్ ఆలయ దైవ సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యుడు శ్రీ ఆనందసాయి కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. ఆలయ పరిరక్షణ, అభివృద్ధిపై ఆయన ఆలయ నిర్వాహకులతో చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికత, కేరళలోని ఆలయ సందర్శనపై జనసేన అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Ishan Kishan at the RBI Patna regional office after joining as Assistant Manager under the sports quota.

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్...

Ishan Kishan: టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. క్రికెట్ కెరీర్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో అడుగుపెట్టిన ఆయన, "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)"లో అసిస్టెంట్...
- Advertisement -
Chat on WhatsApp