Telangana: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణకు చెందిన పలు రాజకీయ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, తాజాగాగా గద్దర్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల ఘాటుగా స్పందించారు.
పవన్ వ్యాఖ్యలకు నేరుగా కౌంటర్ ఇచ్చిన వెన్నెల, తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేల గతంలో మా “తెలంగాణ గడ్డ నిన్న మా తండ్రుల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు. దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదు” అంటూ ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతో రాలేదని, కోట్లాది మంది ప్రజల త్యాగాల ఫలితంగా ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన త్యాగాలను గుర్తు చేస్తూ, ఎందరో ప్రాణాలు కోల్పోయారని, కుటుంబాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయని వెన్నెల ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో జరిగిన ఘటనలు రాష్ట్ర సాధనకు ఎంత కీలకమో ఆమె వివరించారు.
అంతేకాకుండా, పవన్ కల్యాణ్‌ను తెలంగాణ ప్రజలు ప్రధానంగా సినిమా నటుడిగానే చూస్తారని, రాజకీయ వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ఆయన గద్దర్ అభిమాని కావడంతో ఆ కోణంలో గౌరవం ఉన్నా, రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తే అంగీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.
ఇక ఈ వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ తెలంగాణ నేతల విమర్శలను తప్పుబట్టగా, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు పవన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో ఈ అంశం రాజకీయ చర్చగా మారింది.
ALSO READ: కర్ణాటకలో కొత్త అధ్యాయం.. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం








