ఈ నెల 20న నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేష్….
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం(Oath Ceremony) చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇరువురు నేతలు ఈ నెల 20న పాట్నా పర్యటనకు వెళ్లనున్నారు.
ALSO READ:Vijayawada Maoist Arrests: ఏకే-47 సహా భారీ ఆయుధాలు స్వాధీనం
బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేశ్ ఎన్డీయే తరఫున చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆయన పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, పారిశ్రామిక వేత్తలతో కూడా సమావేశాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార వేడుకకు ఆహ్వానం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆధికారిక వర్గాల సమాచారం ప్రకారం, చంద్రబాబు మరియు లోకేశ్ కార్యక్రమంలో పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలపనున్నారు. ఈ పర్యటన ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నారు.
