Sunday, April 12, 2026
Chat on WhatsApp
HomeNationalNew ration card rules | రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి...2026 కొత్త రేషన్ కార్డు...

New ration card rules | రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి…2026 కొత్త రేషన్ కార్డు నిబంధనలు ఇవే

-

Chat on WhatsApp

New ration card rules: కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ 2026కి కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకత కోసం దేశవ్యాప్తంగా రేషన్ కార్డులను 100 శాతం డిజిటలైజ్ చేశారు.

వీటిలో 99 శాతం పైగా కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఇకపై ప్రతి సభ్యుడూ తప్పనిసరిగా ఈ-కేవైసీ(e-KYC) పూర్తి చేయాలి. గడువులోగా పూర్తి చేయకపోతే సభ్యుల పేర్లు కార్డు నుంచి తొలగించే అవకాశముంది.

One Nation One Ration Card (ONORC) ద్వారా వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే సౌకర్యం మరింత బలోపేతమైంది. ఇప్పటివరకు దాదాపు 200 కోట్లకు పైగా పోర్టబిలిటీ లావాదేవీలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాత కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతమైంది.

ఈ-కేవైసీని సమీప రేషన్ దుకాణంలో ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలతో పూర్తి చేయవచ్చు. అలాగే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డు నంబర్, ఆధార్ వివరాలు నమోదు చేసి ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేసే అవకాశం ఉంది.

గ్రామ/వార్డు సచివాలయాలు, మీ-సేవ కేంద్రాల్లో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల లోపు పిల్లలు, బయోమెట్రిక్ సమస్యలున్న వృద్ధులకు మినహాయింపులు ఉంటాయి. సభ్యుల పేర్లు తొలగించబడకుండా ఉండాలంటే గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయడం అవసరం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

PM Modi addressing a public rally in West Bengal during election campaign

PM Modi | ఆడబిడ్డల భద్రత పై మోడీ ధ్వజం .. ఎన్నికల ప్రసంగంలో...

PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. పూర్బ బర్ధమాన్,...
- Advertisement -
Chat on WhatsApp