Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. అనంతరం టీడీపీ నేత ఇంటికి

Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్.. అనంతరం టీడీపీ నేత ఇంటికి

-

Chat on WhatsApp

Tirumala: తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి నారా లోకేశ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన నారా లోకేశ్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. తిరుమల పర్యటన అనంతరం లోకేశ్ తిరుపతిలోని భూపాల్ హౌసింగ్ కాలనీకి వెళ్లి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కే. గౌతమి శ్వేత నివాసాన్ని సందర్శించారు. అక్కడ ఏపీ కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతల నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp