Thursday, July 2, 2026
Chat on WhatsApp
HomeNationalDelhi | ఢిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Delhi | ఢిల్లీ పోలీసుల భారీ ఆపరేషన్.. భారీ ఉగ్ర కుట్ర భగ్నం

-

Chat on WhatsApp

Delhi: జాతీయ రాజధాని ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో అనుబంధాలు కలిగిన అంతర్రాష్ట్ర ఆయుధాలు–ఉగ్ర ముఠాను పోలీసులు భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మొత్తం నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురిని పంజాబ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు పట్టుకోగా, మరో అనుమానితుడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుభ్‌దీప్ సింగ్ అలియాస్ విశాల్, గుర్జంత్ సింగ్ అలియాస్ రిషి, సజన్ సింగ్ అలియాస్ హనీ, గగన్‌ప్రీత్ గా గుర్తించారు.

పోలీసుల ప్రకారం, ఢిల్లీ–ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాడులకు అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో ప్రత్యేక సెల్ బృందం ఆపరేషన్ ప్రారంభించింది. సాంకేతిక ఆధారాలు, గూఢచారి సమాచారం ఆధారంగా అనుమానితులను గుర్తించి పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో సమన్వయ దాడులు నిర్వహించారు. మొదట అమృత్‌సర్‌లోని మజీతా రోడ్డులో శుభ్‌దీప్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక సెమీ ఆటోమేటిక్ పిస్టల్, సజీవ బుల్లెట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

విచారణలో అనుమానితులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో సోషల్ మీడియా ద్వారా సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. . డ్రోన్ల సహాయంతో సరిహద్దు అవతలి నుంచి ఆయుధాలు, నార్కోటిక్స్ సరఫరా అయినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లపై నిఘా పెట్టి దాడులకు సిద్ధం కావాలని వారికి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 24న ఢిల్లీలో గగన్‌ప్రీత్‌ను అరెస్టు చేయగా, అతని మొబైల్‌లో కీలక ఆధారాలు లభించాయి. మరోవైపు సజన్ సింగ్‌పై గతంలో ఎన్డీపీఎస్ కేసు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం నెట్‌వర్క్ పాకిస్థాన్ హ్యాండ్లర్ల సూచనలతో పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp