AP EAPCET Results 2026 Out: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విడుదల చేశారు.
ఫలితాలతో పాటు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ఉత్తీర్ణత శాతాలను కూడా వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు మొత్తం 2,76,572 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,58,545 మంది పరీక్షకు హాజరుకాగా, 1,82,317 మంది అర్హత సాధించారు. దీంతో ఈ విభాగంలో మొత్తం 70.52 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 79,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 70,929 మంది పరీక్ష రాశారు.
వీరిలో 63,546 మంది క్వాలిఫై అయ్యారు. ఈ విభాగంలో ఉత్తీర్ణత శాతం 89.59గా నమోదై, ఇంజినీరింగ్‌తో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది.








