Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ‘మన ఇల్లు-మన లోకేశ్'(Mana Illu-Mana Lokesh) పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది లబ్ధిదారులకు శాశ్వత భూపట్టాలను అందజేశారు. ఈ పట్టాల మొత్తం విలువ దాదాపు రూ.1000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్.. ఈ భూపట్టాలతో పేదలకు శాశ్వత ఆస్తి హక్కు లభిస్తుందని, ఇకపై వారి భూములపై ఎలాంటి అనిశ్చితి ఉండదన్నారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో తన ఓటమిని, ఆ సమయంలో తనతో పాటు చంద్రబాబు నాయుడిపై వచ్చిన విమర్శలను గుర్తు చేసుకున్న ఆయన.. అదే తనకు సవాలుగా మారిందన్నారు. మంగళగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. దేశంలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా మంగళగిరిని నిలబెట్టడమే తన లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.
ALSO READ: PM Modi | ‘ఘోర పాపం’ చేసారు.. నీట్ పేపర్ లీక్‌పై మోడీ ఆగ్రహం








