Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోనమ్మ తోటలో మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ఘనంగా నిర్వహణ

కోనమ్మ తోటలో మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ఘనంగా నిర్వహణ

-

Chat on WhatsApp

కోవూరు మండలంలోని కోనమ్మ తోటలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ నందు శ్రీనివాస రామనాథన్ జయంతి సందర్భంగా మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథులుగా కోవ్వూరు ఎస్‌ఐ రంగనాథ్ గౌడ్ మరియు గాదిరాజ్ అశోక్ కుమార్ హాజరై, విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు.

ముఖ్య అతిథులు ప్రోగ్రామ్‌లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంలో స్కూలు చేస్తున్న కృషిని వారు మెచ్చుకున్నారు.

స్కూలు ప్రిన్సిపాల్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్కూలు ప్రత్యేకంగా విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ప్రత్యేక దృష్టి పెట్టింది అని పేర్కొన్నారు. సుమారు 150 కి పైగా ప్రాజెక్టులతో ఈ ప్రోగ్రామ్‌లో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు.

మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024లో వివిధ ప్రాజెక్టులు, ఆవిష్కరణలు విద్యార్థుల సృజనాత్మకతను చాటాయి. కార్యక్రమం విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాక, విజ్ఞానాన్ని విస్తరించేందుకు ఉపకరించిందని పాల్గొన్న అతిథులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh cabinet approves major decisions under chief minister chandrababu naidu

AP Cabinet | చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. రైతులు, అమరావతి, సోషల్ మీడియాపై బిగ్ డెసిషన్స్!

AP Cabinet: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, విద్య, పర్యాటకం, పరిపాలన వంటి కీలక రంగాలకు సంబంధించిన పలు నిర్ణయాలకు...
- Advertisement -
Chat on WhatsApp