Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadNTR Ghat | ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ క్షణాలు... తాతను స్మరించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 

NTR Ghat | ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ క్షణాలు… తాతను స్మరించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 

-

Chat on WhatsApp

NTR Ghat: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.

సినీ రంగంలో అజరామరమైన గుర్తింపు పొందిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తారక్ తన తాతగారి జయంతిని పురస్కరించుకుని ఘాట్‌ను సందర్శించారు.

ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి చేతులు జోడించి కాసేపు మౌనం పాటించారు. తాతతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పాల్గొని నివాళులు అర్పించారు.

నందమూరి హీరోలు వస్తున్నారనే సమాచారం తెలిసిన అభిమానులు తెల్లవారుజామునే భారీ సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ‘జోహార్ ఎన్టీఆర్’, ‘జై ఎన్టీఆర్’ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఘాట్ పరిసరాలు మారుమోగాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp