ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ పొరపాటు బాంబు దాడి!

An Israeli fighter jet accidentally dropped a bomb inside Israel during a Gaza strike. IDF blames technical malfunction. No casualties reported.

గాజా స్ట్రిప్ లో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ చేస్తున్న కౌంటర్ దాడుల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. బుధవారం జరిగిన వైమానిక దాడిలో భాగంగా గాజాపై దాడికి వెళ్లిన ఓ ఫైటర్ జెట్, సాంకేతిక లోపం కారణంగా బాంబును ఇజ్రాయెల్ భూభాగంలోనే విడిచింది. ఈ ఘటన నిర్ యిత్ఝాక్ అనే గ్రామంలో చోటు చేసుకుంది.

ఇది సదరన్ గాజా సరిహద్దుకు రెండు మైళ్ల దూరంలో ఉంది. మైదాన ప్రాంతంలో బాంబు పడటంతో గాయాలు లేకుండా తప్పించుకున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకారం ఈ దాడి ఒక “టెక్నికల్ మాల్ ఫంక్షన్” వల్ల జరిగిందని తెలిపింది. అక్కడ నివసించే 550 మంది ప్రజల జీవితాలు ఆ దశలో ప్రమాదంలో పడ్డాయని పేర్కొంది.

ఈ ఘటన జరిగే సమయానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నార్తరన్ గాజాలో పర్యటనలో ఉన్నారు. హమాస్ ఉగ్రవాదులను నిర్మూలించేదాకా దాడులు ఆగవని నెతన్యాహు ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పొరపాటు జరగడం గమనార్హం. దీని వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగింది.

ఈ ఘటన నేపథ్యంలో రక్షణ వ్యవస్థలపై విశ్వాసం పునరాలోచనకు గురవుతోంది. సాంకేతిక లోపాల కారణంగా ఇలా ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉండటం, భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తింపజేసింది. ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *