టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ నిర్వహించాలనుకున్న సంగీత కచేరీకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ నెలలో జరగాల్సిన ఈ గ్రాండ్ ఈవెంట్‌ను పోలీసులు నిలిపివేశారు.
విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ కచేరీకి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇటీవలే ఇదే క్లబ్ వాటర్ వెల్డ్‌లో ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం, ఆ ఘటనపై ఇంకా స్పందనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. టికెట్లను ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున విక్రయించిన నిర్వాహకులు ఈ నిర్ణయంతో అయోమయంలో పడిపోయారు. అభిమానులు కూడా తమ టికెట్ల పరిస్థితి ఏంటన్న ఆశ్చర్యంలో ఉన్నారు.
డీఎస్‌పీ తరఫున ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ షో కోసం ఎదురుచూస్తున్న సంగీత ప్రియులకు ఈ శుభవార్త రాకముందే నిరాశ దక్కింది. ఎలాంటి పరిష్కారం తలపడతారో చూడాలి.