LIVE
Friday, November 6, 2026
LIVE
LIVE

4th T20 Match | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్ ముందు 260 పరుగుల భారీ లక్ష్యం

by Bajaswamy
13 views
New Zealand vs India 4th T20

4th T20 Match: నాలుగో టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ కేవలం 49 బంతుల్లో 107 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు మైఖేల్ బ్రేస్‌వెల్ కూడా 25 బంతుల్లో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ 38 పరుగులకు ఒక వికెట్, ప్రిన్స్ యాదవ్ 49 పరుగులకు ఒక వికెట్ తీశారు. అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ సాధించారు. అయితే నితీశ్ 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ముందు 260 పరుగుల భారీ లక్ష్యం ఉంది. ఇప్పటికే సిరీస్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ దిశగా మరో అడుగు వేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More