HomeBusinessGold Rates Today | హైదరాబాద్ సహా పలు నగరాల్లో తగ్గిన గోల్డ్ రేట్లు...24 క్యారెట్...

Gold Rates Today | హైదరాబాద్ సహా పలు నగరాల్లో తగ్గిన గోల్డ్ రేట్లు…24 క్యారెట్ ఎంతంటే ?

-

Chat on WhatsApp

Gold Rates Today: పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమైన సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత నాలుగు రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న ధరలు గురువారం మరోసారి పడిపోయాయి.

కొన్ని గంటల వ్యవధిలోనే రేట్లు తగ్గడం గమనార్హం. తాజా తగ్గుదలతో పలు నగరాల్లో బంగారం ధరలు కొంత దిగివచ్చాయి.


హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,560గా నమోదైంది. బుధవారం ఈ ధర రూ.1,64,510గా ఉండగా ఒక్కరోజులోనే రూ.980 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900గా ఉంది. నిన్నటి ధర రూ.1,50,800తో పోలిస్తే రూ.900 తగ్గుదల నమోదైంది.

విజయవాడ మరియు విశాఖపట్నం, నగరాల్లో కూడా హైదరాబాద్‌కు సమానంగానే ధరలు కొనసాగుతున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,560గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,900గా ఉంది.


చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,950గా ఉంది. బుధవారం రూ.1,65,820గా ఉన్న ధర ప్రస్తుతం రూ.870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,200గా కొనసాగుతోంది.


బెంగళూరు లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,530గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,49,900గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ లో 24 క్యారెట్ల బంగారం రూ.1,63,680, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,050గా ఉంది.


వెండి ధరలు కూడా నగరాల వారీగా మారుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.85 లక్షలుగా ఉండగా, హైదరాబాద్‌లో రూ.2.95 లక్షలుగా ఉంది. చెన్నైలో కూడా వెండి ధరలు హైదరాబాద్‌కు సమానంగా కొనసాగుతున్నాయి.

మొత్తంగా చూస్తే బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే పరిణామంగా కనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp