HomeSportsLionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

-

Chat on WhatsApp

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్జెంటీనాలోని రొసారియోలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లియోనెల్ మెస్సీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానానికి చేరుకోవడంలో జార్జ్ మెస్సీ(Jorge Messi) పాత్ర ఎంతో కీలకం. చిన్న వయసులోనే మెస్సీని అర్జెంటీనా నుంచి స్పెయిన్‌లోని బార్సిలోనాకు తీసుకెళ్లడం నుంచి ఆయన కెరీర్‌కు సంబంధించిన ఒప్పందాలు, నిర్వహణ, కీలక నిర్ణయాల వరకు ప్రతి దశలోనూ తండ్రిగానే కాకుండా మేనేజర్‌గా కూడా జార్జ్ అండగా నిలిచారు.

కొద్ది వారాల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు రావడంతో కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేసి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అయితే తాజాగా ఆయన మృతి చెందినట్లు వార్తలు రావడంతో అభిమానులు, మాజీ ఆటగాళ్లు, ఫుట్‌బాల్ సంఘాలు మెస్సీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషాద వార్తపై ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Rent Boyfriend | ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో కొత్త సైబర్ మోసం.. యువతులకు సజ్జనార్ హెచ్చరిక

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp
[td_block_1 custom_title="Must Read" limit="4" f_header_font_transform="uppercase" ajax_pagination="next_prev" sort="" category_id="_current_cat" td_ajax_filter_type="" td_ajax_preloading="preload"]
- Advertisement -
Chat on WhatsApp