IAS Santosh Verma Controversy: ఇటివల IAS సంతోష్ వర్మ బ్రాహ్మణకూతుళ్ల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణుల కూతుళ్లపై చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ అధికారి పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఆయన చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతోష్ వర్మ వ్యాఖ్యలు ఏకపక్షంగా, తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐఏఎస్ (కండక్ట్) రూల్స్ – 1967 నిబంధనలను ఈ వ్యాఖ్యలు ఉల్లంఘించినట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది.
ALSO READ:Muzammil Shaheen Marriage Controversy | డాక్టర్ షహీన్ నా ప్రియురాలు కాదు భార్య
నోటీసులో, తన వ్యాఖ్యలకు సంబంధించిన వివరణను సంతోష్ వర్మ సమర్పించాలని ఆదేశించారు. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
అధికారుల గౌరవం, ప్రవర్తనా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయంపై మరిన్ని వివరాలు సేకరించడానికి సంబంధిత విభాగాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
