Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeNationalIAF AN-32 | అస్సాంలో ఎయిర్ ఫోర్స్ AN-32 క్రాష్.. సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా...

IAF AN-32 | అస్సాంలో ఎయిర్ ఫోర్స్ AN-32 క్రాష్.. సాంకేతిక లోపమా, వాతావరణ ప్రభావమా ?

-

Chat on WhatsApp

IAF AN-32: అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన AN-32 ట్రాన్స్‌పోర్ట్ విమానం ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపుతోంది. జోర్‌హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటనపై ప్రాథమిక వివరాలు బయటకు వచ్చాయి. ల్యాండింగ్ అవుతూనే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.

సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అలాగే ఈ ఘటనలో గాయాలు లేదా ప్రాణనష్టం జరిగిందా అనే విషయంపై అధికారిక వివరాలు రావాల్సి ఉంది. భారత వైమానిక దళం ఈ ఘటనపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

సోవియట్ యూనియన్ అభివృద్ధి చేసిన AN-32 ట్రాన్స్‌పోర్ట్ విమానం, భారత వైమానిక దళంలో కీలకమైన ‘వర్క్‌హార్స్’గా గుర్తింపు పొందింది. కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనిచేయగల సామర్థ్యం దీని ప్రత్యేకత. హై ఆల్టిట్యూడ్ ఎయిర్‌ఫీల్డ్స్‌లో ల్యాండింగ్ చేయగల సామర్థ్యం, వేడి వాతావరణంలోనూ సమర్థవంతంగా పనిచేయడం దీని బలమైన అంశాలు. సుమారు 7.5 టన్నుల కార్గోను మోసుకెళ్లగల ఈ విమానం, సిబ్బంది రవాణా మరియు రిమోట్ ప్రాంతాలకు సరఫరా కార్యకలాపాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతోంది.

ఇటీవలి కాలంలో అస్సాంలోనే మరో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిన ఘటన కూడా సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు భారత వైమానిక దళంలో ఆందోళనను పెంచుతున్నాయి. ప్రస్తుతం AN-32 ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం సాంకేతిక లోపమా, వాతావరణ పరిస్థితుల ప్రభావమా లేదా ఇతర కారణాలా అనే దానిపై అధికారులు పరిశీలిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp