Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeTelanganaRangareddyORR Bus Fire Accident | ఓఆర్ఆర్‌పై భారీ అగ్ని ప్రమాదం... ప్రైవేట్ ట్రావెల్స్...

ORR Bus Fire Accident | ఓఆర్ఆర్‌పై భారీ అగ్ని ప్రమాదం… ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

-

Chat on WhatsApp

ORR Bus Fire Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొహెడ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగాభారీ మంటలు చెలరేగాయి.

నిమిషాల వ్యవధిలో ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి వాహనం పూర్తిగా అగ్నిలో ఆహుతి అయిపోయింది. అయితే డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రయాణికులను వెంటనే బయటకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.

ఇంజిన్‌లో పొగలు.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది

సమాచారం ప్రకారం, బస్సు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వైపు నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తోంది. కొహెడ సమీపానికి రాగానే ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్కకు ఆపాడు.

అప్రమత్తమైన క్లీనర్ సహా సిబ్బంది తక్షణమే ప్రయాణికులందరినీ లగేజీతో సహా బయటకు దించారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.

అగ్నిమాపక సిబ్బంది తక్షణ స్పందన

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

షార్ట్ సర్క్యూట్ అనుమానం

ప్రాథమికంగా ఈ ప్రమాదం ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp