LIVE
Monday, November 16, 2026
LIVE
LIVE

Narendra Modi Mother Temple | ఏపీలో మోడీ తల్లి పేరిట ఆలయం.. ఎక్కడో తెలుసా?

by Bajaswamy
2 views
Narendra Modi Mother Temple in Andhra Pradesh

Narendra Modi Mother Temple: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుటుంబంపై అభిమానాన్ని చాటుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రత్యేక ఆలయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ప్రధాని మోడీ తల్లి దివంగత హీరాబెన్‌ మోడీ పేరిట కర్నూలు జిల్లాలో ఆలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్‌ గ్రామంలో నవంబర్‌ 15న ఈ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. మాతా శ్రీ మందిరం చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు హాజరై ఆలయ నిర్మాణానికి తమ మద్దతు తెలిపారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, వైసీపీ నాయకుడు రుద్రగౌడ్‌, మాజీ సర్పంచ్‌ పంపన్న గౌడ్‌, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, జనసేన సమన్వయకర్త చల్లా వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంగణంలో హీరాబెన్‌ ఆలయంతో పాటు శివుడు, దక్షిణమూర్తి, శ్రీరాముడు, వినాయకుడి ఆలయాలను కూడా నిర్మించనున్నారు. అంతేకాకుండా అనాథ శరణాలయం, గోశాల ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. మొత్తంగా ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆలయం భవిష్యత్తులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందో చూడాలి.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More