LIVE
Monday, November 16, 2026
LIVE
LIVE

Rajigadu Rajayyadu | ఆసక్తి రేపుతున్న ‘రాజిగాడు రాజయ్యాడు’.. టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

by Bajaswamy
1 views
Rajigadu Rajayyadu First Look

Rajigadu Rajayyadu: సినిమా టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ, విభిన్నమైన కథాంశంతో మరో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అల్తాఫ్ హసన్ ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా తన కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపిస్తున్న ప్రత్యేకమైన నేపథ్యం సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. ఓ భారీ గడీ బయట, ఒంటిపై గాయాలతో చేతిలో పంది పిల్లను పట్టుకుని కుర్చీలో కూర్చున్న హీరో లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చుట్టూ కులవృత్తులకు సంబంధించిన పనిముట్లు కనిపించడం కథలో సామాజిక అంశాలకు కూడా ప్రాధాన్యత ఉండబోతోందనే సంకేతాలను ఇస్తోంది.

అసలు రాజిగాడు ఎవరు? ఆ గడీకి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? చేతిలో పంది పిల్లను ఎందుకు పట్టుకున్నారు? ఒంటిపై గాయాలకు కారణమేంటి? అనే ప్రశ్నలు పోస్టర్ చూసిన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే టైటిల్‌లోని స్థానిక నేటివిటీ, కథలోని ప్రత్యేకతపై అంచనాలను పెంచుతోంది. శర్మాస్ ఫిలింస్ బ్యానర్‌పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్తాఫ్ హసన్ సరసన అను శ్రీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు గీతా అగర్వాల్, రాజేంద్ర మోహన్ నను, శ్రీవర్ధన్ త్రివేది, సుజాత దీక్షిత్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్ గౌడ్, డా. శివకుమార్ కాముని తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను డా. విజయ్ భాస్కర్ అందించగా, స్క్రిప్ట్ అనలిస్ట్‌గా కైలాష్ బాలన్ వ్యవహరిస్తున్నారు. కమల్ నభ్, అనిల్ గొడుగుల, ప్రొ. శ్రీపర్తి రాముడు అసోసియేట్ స్క్రీన్ రైటర్స్‌గా పనిచేస్తున్నారు. రమేష్ సామల సంభాషణలు రాస్తుండగా, జగదీశ్ సత్యన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పి. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ, ఎ. సతీష్ రాజా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి కధిర ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీకాంత్ కనగండ్ల కాస్ట్యూమ్ డిజైనర్‌గా, వెంకట నదురి యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్ కాగా, గాండ్ల శ్రీనివాస్ పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి, టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా చర్చనీయాంశంగా మారుతోంది. అల్తాఫ్ హసన్ ఎంచుకున్న ఈ విభిన్నమైన కథ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో, రాజిగాడి ప్రయాణం ఎలా ఉండబోతోందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే!

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More