Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeBusinessHDFC Bank | రుణగ్రహీతలకు షాక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు

HDFC Bank | రుణగ్రహీతలకు షాక్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంపు

-

Chat on WhatsApp

HDFC Bank: భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను సవరించి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ కొత్త రేట్లు 2026 జూన్ 8 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పు వల్ల వివిధ కాలపరిమితి రుణాలపై వడ్డీ భారము పెరిగింది. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 5 బేసిస్ పాయింట్లు పెరిగి 8.40 శాతంగా నమోదైంది. రెండేళ్ల కాలానికి సంబంధించిన రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 8.55 శాతానికి చేరింది. అదేవిధంగా ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి, మూడేళ్ల రేటు 8.65 శాతానికి పెరిగింది.

మూడు నెలల కాలపరిమితి రేట్లు కూడా స్వల్పంగా పెరిగి 8.10 శాతం నుంచి 8.20 శాతం మధ్య స్థిరపడ్డాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును యథాతథంగా కొనసాగించినప్పటికీ, నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ వల్ల గృహ రుణాలు, వాహన రుణాలు మరియు వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.

ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది లేదా రుణ కాలపరిమితి పొడిగించబడవచ్చు. అయితే ఈ కొత్త వడ్డీ రేట్లు తక్షణం అన్ని రుణాలకు వర్తించవని, రుణ రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తాయని బ్యాంక్ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp