Gold & Silver Rates: వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కొనసాగుతోంది.
అదే సమయంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనపడటంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాల మధ్య స్వల్ప తగ్గుదల నమోదైంది.
జనవరి 12 ఉదయం 6:30 గంటల లైవ్ రేట్ల ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,740గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,600గా, 22 క్యారెట్ల ధర రూ.1,28,890గా నమోదైంది.
ALSO READ:Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ ఇంటర్వల్ యాక్షన్ అప్‌డేట్!
వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై సుమారు రూ.100 మేర తగ్గుదల కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.2,74,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,59,900గా నమోదైంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, హైదరాబాద్, విజయవాడ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళ, పుణేలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,450గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,28,740గా ఉంది. వడోదరలో 24 క్యారెట్ల బంగారం రూ.1,40,500గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,28,790గా నమోదైంది.
