Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeBusinessGold and silver prices | గోల్డ్ రేట్స్ తగ్గుముఖం.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

Gold and silver prices | గోల్డ్ రేట్స్ తగ్గుముఖం.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

-

Chat on WhatsApp

Gold and silver prices: దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. మే 18న నమోదైన తాజా ధరల ప్రకారం దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920గా నమోదైంది.

అయితే రోజంతా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,840గా ఉంది. విజయవాడ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,070గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,990గా నమోదైంది.

ఇక చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,090 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490గా కొనసాగుతోంది.

వెండి ధరలు కూడా కొంత మేర తగ్గాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,89,900గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,79,900గా నమోదైంది. ధరలు తగ్గడంతో బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

three new additional judges appointed to andhra pradesh high court

Andhra Pradesh | న్యాయవ్యవస్థలో కీలక మార్పు.. హైకోర్టుకు ముగ్గురు అదనపు జడ్జిల నియామకం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో ఖాళీగా ఉన్న అదనపు న్యాయమూర్తుల పదవులను భర్తీ చేస్తూ ముగ్గురు న్యాయవాదులను...
- Advertisement -
Chat on WhatsApp