Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeJammu & KashmirJammu Kashmir | కాల్పులకు కౌంటర్ యాక్షన్.. ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు

Jammu Kashmir | కాల్పులకు కౌంటర్ యాక్షన్.. ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేసిన అధికారులు

-

Chat on WhatsApp

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు కఠిన చర్యలు చేపట్టాయి. అనంత్‌నాగ్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌పై కాల్పుల ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిందితులు ఆదిల్ థోకర్, హరూన్ రషీద్‌కు చెందిన నివాసాలను భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. కాల్పుల ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఆదిల్ థోకర్ నిర్మించిన మరో కొత్త ఇంటిని కూడా అధికారులు ధ్వంసం చేశారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని భద్రతా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అనంత్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి. హెడ్ కానిస్టేబుల్‌పై జరిగిన దాడికి సంబంధించి నిందితుల నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సహకరించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Yuvraj Singh extends support to students amid nationwide protests over NEET paper leak controversy.

Yuvraj Singh | NEET వివాదంలో కొత్త ట్విస్ట్.. యువరాజ్ ఎంట్రీ

Yuvraj Singh: NEET ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతుండగా, పలువురు ప్రముఖులు...
- Advertisement -
Chat on WhatsApp