Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTనాని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్...అభిమానులకు పండగే పండగ 

నాని ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్…అభిమానులకు పండగే పండగ 

-

Chat on WhatsApp

The Paradise: నేచురల్ స్టార్ నాని అభిమానులను మరోసారి సంతోషపరిచేందుకు మంచి శుభవార్త అందించారు. ఆయన తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise) నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ఫిబ్రవరి 24న విడుదల సిద్ధంగా ఉందని చిత్రబృందం వెల్లడించింది.

నాని పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను బర్త్‌డే స్పెషల్ ట్రీట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ప్రోమోలో నాని ఎనర్జీ అద్భుతంగా కనిపించటం, నెటిజన్లను ఆశ్చర్యంలో నెట్టేసింది.

దర్శకుడుశ్రీకాంత్ ఓదెల‌– నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ఆయా షేర్’ సాంగ్‌ను రామోజీ ఫిలిం సిటీలో వందల డ్యాన్సర్లతో చిత్రీకరించారు. నాని మాసీ అవతార్‌లో కనిపించనున్న ఈ పాటకు అనిరుధ్ రవిచంద్రే సంగీతం అందించారు, సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

మొదట మార్చిలో రిలీజ్ అవ్వనుందని భావించిన ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్ ప్లాన్ చేశారు.

ఎడిటర్ నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ సి.హెచ్. సాయి, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల పని చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే ఆశ ఉంది.

ALSO READ:Indian Air Force | తేజస్ Mk1A యుద్ధవిమానాల వరుస ప్రమాదాలు.. IAF షాకింగ్ నిర్ణయం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp