జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భద్రతా బలగాల భారీ ఆపరేషన్ చేస్తూ తమ కఠిన చర్యలను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. పుల్వామా జిల్లాలో శుక్రవారం చేపట్టిన కీలక ఆపరేషన్‌లో, ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని(Terrorist House Demolition) భద్రతా బలగాలు పేలుడు పదార్థాలతో పూర్తిగా ధ్వంసం చేశాయి.
ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు ఆశ్రయ కేంద్రంగా మారిందన్న నిఘా సమాచారం రావడంతో ఈ చర్య తీసుకున్నారు.
ఉమర్ నబీ(Umar Nabi) పుల్వామాకు చెందినవాడు. అతడు గతంలో ఢిల్లీలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అని నిఘా సంస్థలు గుర్తించాయి. పరారీలో ఉన్న అతడు లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ:Railway cable wires burnt | వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద కేబుల్ వైర్లు దగ్ధం
అతడి ఇంటిని ఉగ్రవాదులు దాచుబంగళాగా, ఆయుధాలు నిల్వచేసే కేంద్రంగా వినియోగిస్తున్నట్టు నిర్ధారణ కావడంతో భద్రతా బలగాలు ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి ఆపరేషన్ ప్రారంభించాయి.
నియంత్రిత పేలుడు పదార్థాలతో ఇంటిని నేలమట్టం చేసిన తర్వాత ప్రాంతంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో ఉగ్రవాదులకు, వారికి సహకరించే వారికి ఇకపై ఎలాంటి రాయితీలు లేవన్న సందేశం వెళ్లిందని అధికారులు తెలిపారు.
