LIVE
Thursday, November 5, 2026
LIVE
LIVE

Delhi Building Collapse | ఢిల్లీలో ఘోర ప్రమాదం..  కుప్పకూలిన ర్మాణంలో ఉన్న భవనం

by Bajaswamy
4 views

Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అప్పటివరకు పనులతో సందడిగా ఉన్న ప్రాంతం.. భవనం కుప్పకూలడంతో భయాందోళనలకు గురైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని చావుడీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలోని గలీ సితారాలో గురువారం ఉదయం సుమారు 9:50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మూడంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లు, రెస్క్యూ వాహనాలతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శిథిలాలను తొలగించే పనులు కొనసాగించారు.

ప్రమాద సమయంలో సమీపంలో ఉన్న స్థానికుడు మహమ్మద్ నయీమ్ తన అనుభవాన్ని వివరించారు. ఉదయం భారీ శబ్దం వినిపించడంతో భయపడి బయటకు పరుగులు తీశామని, పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయినట్లు గుర్తించామని తెలిపారు. గత మూడు, నాలుగు నెలలుగా అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మూడు నుంచి నాలుగు స్లాబ్‌లు ఒకేసారి కూలిపోయాయని చెప్పారు. ఘటనాస్థలంలో ముగ్గురు, నలుగురు కార్మికులు ఉన్నట్లు గాయపడిన వ్యక్తి చెప్పాడని వెల్లడించారు. మరోవైపు, దీపావళి పండుగకు ముందు చాందినీ చౌక్, చావుడీ బజార్ హోల్‌సేల్ మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More