LIVE
Thursday, November 5, 2026
LIVE
LIVE

Muthuswamy Dikshitar | ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి.. రూ.250 స్మారక నాణెం విడుదల చేసిన కేంద్రం

by Bajaswamy
5 views
Muthuswamy Dikshitar

Muthuswamy Dikshitar: భారతీయ శాస్త్రీయ సంగీతానికి విశేష సేవలందించిన మహనీయులను గౌరవించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక సంగీతానికి ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతిని పురస్కరించుకుని రూ.250 స్మారక నాణేన్ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారణాసిలోని ఐఐటీ-బీహెచ్‌యూ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నాణేన్ని ఆవిష్కరించారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరిగా గుర్తింపు పొందిన ముత్తుస్వామి దీక్షితార్ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గుర్తుగా ఈ ప్రత్యేక నాణేన్ని రూపొందించారు. అయితే, ఇది సాధారణంగా మార్కెట్లో చెలామణి అయ్యే నాణెం కాదు. స్మారక నాణెంగా మాత్రమే అందుబాటులో ఉండనుంది. సంగీతాభిమానులు, నాణేల సేకరణపై ఆసక్తి ఉన్నవారు భారత ప్రభుత్వ మింట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ నాణేన్ని కొనుగోలు చేయవచ్చు. భారతీయ సంగీత వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, మహనీయుల సేవలను గుర్తుచేసే అరుదైన జ్ఞాపకంగా ఈ రూ.250 స్మారక నాణెం నిలవనుంది.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More