కొమురం భీం జిల్లా కేంద్రంలో కార్డెన్ సర్చ్ నిర్వహణ

In Komuram Bheem Asifabad, police seized 20 bikes and 1 auto during a cordon search. Authorities advised youth to avoid bad habits.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సోదాల సమయంలో సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

సాధారణ ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలియజేశారు.

ఇక యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని, తమ భవిష్యత్తును అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలని సీఐ సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పోలీసుల ఈ చర్యలపై ప్రజలు సానుకూలంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *